Home రాష్ట్ర వార్తలు కాలేజీ బస్సులోకి దూసుకువెళ్లిన క్రేన్

కాలేజీ బస్సులోకి దూసుకువెళ్లిన క్రేన్

పలువురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

busపంజాగుట్ట : హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగే 5కె రన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సివిఆర్ ఇంజినీరింగ్ కాలేజీ బస్సును రవీంద్రభారతి చౌరస్తాలో భారీ క్రేన్ డీకొట్టింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఇబ్రహీంపట్నానికి చెందిన సివిఆర్ ఇంజి నీరింగ్ కాలేజీ యాజమాన్యం ఆదివారం 5కె రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది. ఇందులో భాగంగా కాలేజీ నుంచి 12 బస్సుల్లో విద్యార్థులు బయలుదేరారు. చివరిగా వెళ్తున్న బస్సు నాంపల్లి వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్తుండగా, రవీంద్రభారతి చౌరస్తాలో లక్డీకపూల్ వైపు నుంచి నాంపల్లి వైపుకు వెలుతున్న ఎల్ అండ్ టికి చెందిన భారీ క్రేన్ ముందు భాగం బస్సును ఢీ కొంది. అతివేగంగా వెలుతున్న బస్సును డ్రైవర్ నిలపలేక పోవడంతో బస్సు అద్దాలను చీల్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో మంజూష అనే విద్యార్థిని, ఫ్యాకల్టి సభ్యుడు సాయిరెడ్డిలు తీవ్రంగా గాయపడగా మిగిలిన వారు స్వల్పగాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల్లో కొందర్ని గ్లోబల్ ఆసుపత్రికి, మరికొందర్ని మాక్సికేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.