Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

క్రేజీ కాంబినేషన్‌లో…

Crazy-Combination

మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్‌కు పేరు రావడంలో వెంకటేష్ పాత్ర ఎంతో కొంత ఉందనే చెప్పాలి. ‘నువ్వు నాకు నచ్చావ్’ దర్శకుడు విజయ్ భాస్కర్ అయినప్పటికీ దానికి రచయితగా పనిచేశాడు త్రివిక్రమ్. అందులో తనకు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్‌తో వెంకీ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అందుకే త్రివిక్రమ్ అంటే వెంకటేష్‌కు ప్రత్యేకమైన అభిమానం. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని తెలిసింది. ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఆతర్వాత అతను వెంకటేష్‌తో సినిమా చేస్తాడట. అది కూడా హారికా హాసిని బ్యానర్‌పైనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎఫ్2, వెంకీ మామ సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఈ సినిమాల గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను మొదలుపెట్టవచ్చని తెలిసింది. కానీ ‘అరవింద సమేత…’ విడుదలయ్యాకే త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.

Comments

comments