Home సినిమా క్రేజీ ఆఫర్లు

క్రేజీ ఆఫర్లు

Anasuyaపాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిగా కూడా టాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘క్షణం’లాంటి కొన్ని సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన ఆమెకు నటిగా పెద్ద బ్రేక్ మాత్రం ‘రంగస్థలం’ చిత్రంతోనే వచ్చింది. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. కొరటాల శివ తన కొత్త సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సైరా’ షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాలో అనసూయకు మంచి ప్రాధాన్యత ఉండే ఒక పాత్రను ఆఫర్ చేశాడట కొరటాల. అనసూయ వెంటనే ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా కాకుండా మరో క్రేజీ ఆఫర్ కూడా ఆమెకు వచ్చిందని తెలిసింది. ‘రంగస్థలం’తో అనసూయకు పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తన నెక్స్ సినిమాలో కీలకమైన పాత్రను ఆఫర్ చేశాడట. సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ఆఫర్లు చూస్తుంటే అనసూయ త్వరలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారడం ఖాయమని అనిపిస్తోంది.

 Crazy Offers for Anasuya bharadwaj