Home తాజా వార్తలు వాటే క్యాచ్…!(వీడియో)

వాటే క్యాచ్…!(వీడియో)

Cricketప్రస్తుతం క్రికెట్ మానియా మాములుగా లేదు. ఐపిఎల్, వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్ మెగాటోర్నీ ఇలా వరుసగా క్రికెట్ సంబురాలతో క్రికెట్ ప్రేమికులు తడిసిముద్దవుతున్నారు. దీంతో క్రికెట్ కు సంబంధించిన ఏ వార్త వచ్చిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇదే కోవలో తాజాగా క్రికెట్‌కు క్రియేటివిటీ జోడించి వదిలిన ఓ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కొందరు క్రికెట్‌ ప్రేమికులు తమ ఆటకు క్రియేటివిటీ జోడించి ఓ వీడియో​ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతే… అది కాస్తా వైరల్ లా వ్యాపిస్తోంది. బౌలరే బంతిలా మారి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడమే ఈ వీడియో కాన్సెప్ట్‌. ఓ పిల్లాడు తానే బంతిలా బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ మీద దూకి స్లిప్‌లో నిలబడిన మరో బాలుడి చేతుల్లోకి నేరుగా దూకేస్తాడు. దాంతో బ్యాట్స్‌మెన్‌ బ్యాట్ పడేసి నిరాశగా క్రీజు వదిలి వెళ్లిపోతాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు చేసుకునే సెలెబ్రెషన్స్ మాదిరిగా మిగతా పిల్లలు సంబరాలు చేసుకోవడం, బ్యాక్‌ గ్రౌండ్‌లో వికెట్‌ పడిందంటూ కామెంట్రీ రావడం నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా… చాలా బాగా ఉంది, టాలెంటెడ్‌ బౌలర్‌ అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ రీట్వీట్‌ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.