Home తాజా వార్తలు ప్రపంచకప్ కోసం ఆసీస్ జట్టు ఎంపిక

ప్రపంచకప్ కోసం ఆసీస్ జట్టు ఎంపిక

Australia Squadసిడ్నీ: ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్ 2019 మే 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా 15 మంది ఆటగాళ్ల జాబితాను సోమవారం ఉదయం ప్రకటించింది. బాల్ టాంపరింగ్ కారణంగా గత ఏడాదికాలంగా జట్టుకు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. దీంతో ఆసీస్ జట్టు మరింత పటిష్టంగా తయారైంది. ఇటీవల వరుస సిరీస్ విజయాలతో ఫామ్ లోకి వచ్చిన కంగారు జట్టు స్మిత్, వార్నర్ చేరికతో ప్రపంచకప్ లో ఇతర జట్లకు గట్టి పోటీ ఇవ్వడం  ఖాయంగా కనిపిస్తోంది. ఫాస్ట్‌బౌలర్ హేజిల్‌వుడ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఐదుగురు పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్ నైల్ లతో పాటు ఇద్దరు స్పిన్నర్లు ఆడం జంపా, నాథన్ లైయన్‌ చోటు దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నాథన్ లైయన్