Search
Monday 24 September 2018
  • :
  • :

క్రికెట్‌ ఆస్ట్రేలియా సిఇఒ రాజీనామా..!

Cricket Australia chief executive James Sutherland Quits

మెల్‌బోర్న్‌: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్‌లాండ్ బుధవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 17 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సిఇఒగా సదర్‌లాండ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘సుమారు 20 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సేవలందిస్తున్నా. ఇక రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావిస్తూ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. అయితే, 1998లో సిఎలో సభ్యుడిగా తన కెరీర్ ప్రారంభించిన జేమ్స్‌ సదర్‌లాండ్‌ 2001 నుంచి సిఇఒగా కొనసాగుతున్నారు.

Comments

comments