Home తాజా వార్తలు క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న ఎడు మొబైల్ ఫోన్లు, రూ.53,970 నగదు, టివి, సెట్‌టాప్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ధూల్‌పేట, జుంగూర్ బస్తీకి చెందిన విజేందర్ సింగ్, మహేష్ సింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తెలిసిన, తెలియని వారి నుంచి సెల్ ఫోన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పంటర్స్ ద్వారా నగరంలోని ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

15 నుంచి 20మందిని పంటర్లుగా నియమించుకుని బెట్టింగ్ చేస్తున్నారు. టివిలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తే ఐసిసి వర్డ్ కప్2019 మ్యాచ్‌లకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహించాడు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సైలు దుర్గారావు, ఎండి ముజఫర్ అలి అరెస్టు చేశారు.

Cricket betting gang arrested in Hyd