Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గాలె మ్యాచ్‌లో ఓడిన భారత్

cri_manatelangana గాలె : గాలె మైదానంలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో తబడింది. 176 పరుగుల లక్ష ంతో రెండో ఇన్నింగ్స్ బదిలోకి దిగిన భారత ఆటగాళ్లు తొలి ఓవర్లలోనే వికెట్‌కోల్పోయారు. నాలుగో రోజు 23/1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్‌ధావన్(28), అజింక్య రహానే(36) మినహా మిగిలినవాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. భౌలర్ హెరెత్ ఏడు వికెట్లు తీయగా, కౌశల్ మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 63 పరుగులతో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉంది.

Comments

comments