Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

కలం vs ఖాకీలు

మానుకోటలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
ఉత్సాహంగా పాల్గొన్న పోలీసులు,జర్నలిస్టులు
విజేతగా నిలిచిన పోలీస్ జట్టు

Game

మహబూబాబాద్ ప్రతినిధి: పని వత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగికి ఆటవిడుపు ఉండా లని, అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుందని మహ బూ బాబాద్ జిల్లా ఎస్‌పి మురళీధర్ అన్నారు. స్థానిక ఎన్‌టి ఆర్ స్టేడియంలో బుధవారం మహబూబాబాద్ ప్రెస్‌క్లట్, పోలీస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు నిర్వ హించారు. ఈ సందర్భంగా పోలీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఎస్‌పి క్రీడ ముగింపు కార్యక్రమంలో మా ట్లాడుతూ ప్రతి నెలా ఒక రోజున ఈ విధంగా పోలీస్, ప్రెస్ మీడియా, ఇతర ప్రభుత్వ శాఖల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించుకుందామని, తద్వారా పని వత్తిడి తో ఉన్న ఉద్యోగులు, మీడియా మిత్రులకు మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు.

అలాగే పోలీస్, మీడియా మి త్రుల మధ్య స్నేహసంబంధాలు పెంపొం దుతా యన్నారు. జిల్లా కేంద్రంలో ఓ క్లబ్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి ఉద్యోగి మానసి కో ల్లాసానికి కొంత సమయాన్ని క్లబ్‌లో వెచ్చించే అవకాశం ఉంటుదన్నారు. పోలీస్ అంటే భయం విడనాడాలని, ఫ్రండ్లీ పోలీస్‌గా భావించాలని ఎస్‌పి సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఇరువురి మధ్య మ్యాచ్‌లో 132పరుగులతో ప్రథమ స్థానం పోలీస్ జట్టు కైవసం చేసుకోగా, ద్వితీయ స్థానం 76పరుగులతో ప్రెస్‌క్లబ్ మి త్రులు గెలుచుకున్నారు.

ఎస్‌పి చేతుల మీదుగా వారు బహుమతులను అందుకున్నారు. అలాగే పోలీస్ జట్టు నుంచి ఉదయభాస్కర్ 39పరుగులు వ్యక్తిగత స్కోరు సా ధించి ఆల్‌రౌండర్‌గా నిలవగా, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా గూ డూరు సిఐ రమేష్, బెస్ట్ బౌలర్‌గా ఎం.రమేష్, బెస్ట్ పీల్డర్ గా వెంకన్న, ఫయాజ్, బెస్ట్ కీపర్‌గా డిఎస్‌పి రాజ మహేంద్రనాయక్‌కు బహుమతులను అందజేశారు. అలాగే కుమారస్వామి, రాజశేఖర్,సంతోష్‌లోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినందుకు మెమెంటోలు అంద జే శారు. డిఎస్‌పి రాజమహేంద్రనాయక్ అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో టౌన్‌సిఐ, బయ్యారం సిఐ సాం బయ్య, ఎస్సైలు, అధికారులుతదితరులు పాల్గొన్నారు.

Comments

comments