Home స్కోర్ డిసెంబర్‌లో కృనాల్ పాండ్య పెళ్లి

డిసెంబర్‌లో కృనాల్ పాండ్య పెళ్లి

pandya

న్యూఢిల్లీ: భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోదరుడు, ముంబ యి ఇండియన్స్ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న కృనాల్.. తన గర్ల్‌ఫ్రెండ్ పంఖురి శర్మను డిసెంబర్ 27వ తేదీన ముంబయిలోని ఫైవ్‌స్టార్ హోటల్ శాంట క్రూజ్ లో పెళ్లాడబోతున్నాడు. త మ వివాహం విషయాన్ని కృనాల్ స్వయంగా వెల్లడించాడు. అతి కొద్దిమంది దగ్గర బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరగనున్న ట్లు ఈ బరోడా ఆల్ రౌండర్ తెలిపాడు. రెండు సంవత్సరాల క్రి తం కృనాల్ తొలిసారి పంఖురిని కలిశాడు. తన స్నేహితుడి ద్వారా పంఖురితో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి స్నే హం పెళ్లికి దారితీసింది. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వారి వివాహానికి ముహూర్తం ఖరారైంది.