Home తాజా వార్తలు క్రికెటర్ దారుణ హత్య

క్రికెటర్ దారుణ హత్య

Cricketerముంబయి : ముంబయిలో రాకేశ్ పన్వార్ అనే క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముంబయిలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో ఉన్న రాకేశ్ పై ముగ్గురు దుండగలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్ దేశవాళీ మ్యాచుల్లో రాణిస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీల్లో పలుమార్లు రాకేశ్ విజేతగా నిలిశాడు. రాకేశ్ హత్యకు దారి తీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు. పెట్రోల్ బంక్ లో ఉన్న సిసిటివి పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం రాకేశ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Cricketer Rakesh Panwar Murder In Mumbai