Home తాజా వార్తలు స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్‌ సంజు శాంసన్

స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్‌ సంజు శాంసన్

Cricketer Sanju Samson's marriage  photo

 

తిరువనంతపురం:యువ క్రికెటర్ సంజు శాంసన్ తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. శనివారం కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో గల కోవలెమ్‌లోని రిసార్ట్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సంజు తన ప్రియురాలిని వివాహమాడాడు. ఈ రోజు సాయంత్రం వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.

వివాహం అనంతరం సంజు మీడియాతో మాట్లాడాడు. ”చారులత నేను చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నాం. కళాశాల కూడా ఇద్దరిదీ ఒకటే. 30 ఏళ్ల నుంచి మా ఇద్దరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మా కుటుంబాల్లో చెప్పినప్పుడు వెంటనే అంగీకరించారు. మా పెళ్లి నిరాడంబరంగా జరగాలన్నది చారులత కోరిక. తన ఇష్ట ప్రకారమే అత్యంత సన్నిహితుల మధ్య మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యాం” అని తెలిపాడు.

2015 జులైలో భారత్ తరఫున ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన సంజు… ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శాంసన్‌ గతేడాది వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా రూ.8కోట్లతో ధర పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు.ఇక, రంజీ ట్రోఫీలో సంజు కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Cricketer Sanju Samson’s marriage with his classmate