Home తాజా వార్తలు వాటిలో తెలంగాణ పోలీసులు ముందున్నారు…

వాటిలో తెలంగాణ పోలీసులు ముందున్నారు…

Isha-Kumar

హైదరాబాద్:  కేసుల దర్యాప్తులో ఫింగర్ ప్రింట్స్ ఎంతో ఉపయోగపడుతాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డైరెక్టర్ ఇష్ కుమార్ వివరించారు. 19వ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ…. అనేక కీలకమైన కేసును వేలిముద్రలతో ఛేదించామని తెలిపారు. దేశంలో అనేక మంది నేరస్థుల వేలిముద్రల జాబితా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. వేలిముద్రలతో కేసులు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని కొనియాడారు. 1892లో బ్రిటిష్ కాలంలో ఫింగర్ ప్రింట్ మొదలైందన్నారు. మోనాలిసా పేయింటింగ్ చోరీ కేసు పరిష్కారం కూడా ఫింగర్ ప్రింట్‌తో సాధ్యమైందని వెల్లడించారు.

Do not Believe the Rumors : DGP

తెలంగాణ రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్స్ సదస్సు జరగడం రాష్ట్రానికే గర్వకారణమని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని పేర్కొన్నారు. ఫింగర్ ప్రింట్స్‌తో 868 కేసులు ఛేదించామని వివరించారు. 480 పాత కేసులను 42 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామని వెల్లడించారు. పాపిలాన్ టెక్నాలజీ ద్వారా ఏడు వేల మంది పాతనేరస్థులను గుర్తించామని చెప్పారు. రూ.7.2 కోట్ల ఆస్తులను ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన ఆధారాలతో స్వాధీనం చేసుకున్నామన్నారు.