Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జైలు నుంచి హెలికాప్టర్‌లో గ్యాంగ్‌స్టర్ పరార్

Criminal-Escaped-from-Jail-

 

సాయుధ ముఠా సాయం… ముగ్గురు ఖైదీలతో ఉడాయింపు

పారిస్ : ఫ్రాన్స్‌లో సినిమా ఫక్కీలో ఒక గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి హెలికాప్టర్‌లో పరారయ్యాడు. 46 ఏళ్ల కరడుగట్టిన నేరస్తుడు  రెడోయిన్ ఫెయిడ్‌కు దోపిడీ యత్నంలో పాతిక సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఫ్రాన్స్ తూర్పు ప్రాం తంలోని రియాయూ  జైలులో ఉన్నాడు. అయితే పలువురు సాయుధులు తోడుగా నిలవగా, ఒక హెలికాప్టర్ వచ్చి జైలు ఆవరణలో వాలగా ఈ గ్యాంగ్‌స్టర్ విజిటర్స్ రూంలో నుంచి బయటకు వచ్చి హెలికాప్టర్‌లోకూర్చుని దర్జాగా ఉడాయిం చాడు. తనతోపాటు ముగ్గురు ఖైదీలను కూడా వెంటబెట్టుకు వెళ్లాడు.

నేరస్తుడిని తీసుకువెళ్లిన హెలికాప్టర్‌ను ఆ తరువాత స్థానిక పోలీసులు సమీపంలోని గోన్సెసీ ప్రాంతంలో కనుగొన్నారు. జైలుబ్రేక్ ఫెయిడ్‌కు కొత్తేమీ కాదు. 2013లో ఈ   బక్కపల్చటి, నున్నటి గుండు ఆసామీ నలుగురు గార్డులను బందీలుగా చేసుకుని వారినే రక్షణ కవచంగా మలుచుకుని డైనమైట్లతో జైలు ఇనుప తలుపులను బద్దలు కొట్టి పరారయ్యాడు. ఇటీవలే దోపిడీ ఘటనలో జైలు శిక్ష పడ్డ ఫెయిడ్ కటకటాల పాలయిన అరగంటలోనే జైలు అధికారులే కళ్లు తిరిగి పడిపొయ్యేలా హెలికాప్టర్‌లో పారిపోవడం సంచలనానికి దారితీసింది. ఈ గ్యాంగ్‌స్టర్ దోపిడీలలో ప్రావీణ్యం ఉంది. అంతేకాదు రచనాశక్తిలోనూ దిట్ట. అయితే ఏడాది తిరగకుండానే దోపిడీకి యత్నించి దొరికిపొయ్యా డు.

ఈ ఘటన సందర్భంగా ఒక పోలీసు అధికారిని చంపేశాడు. సియినీ ఎట్‌మార్నే ప్రాం తంలో ఆయనను ఉంచిన జైలుకు కంచె లేకపోవడంతో ద్వారం వద్ద రణగొణధ్వనితో హెలికాప్టరు వచ్చి నిలవడంతో భద్రతా అధికారులు అంతా కంగుతిన్న సమయంలో ఎవరిపైనా దాడికి దిగాల్సిన అవసరం ఏమీ లేకుండానే ఈ గ్యాంగ్‌స్టర్ ఖైదీ తప్పించుకుపొయినట్లు వెల్లడైంది. జైలు బ్రేక్‌కు ఫెయిడ్ సన్నిహితుల గ్యాంగ్ భారీ స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. వారు తొలుత జైలు సమీపప్రాంతంలో ఆగి ఉన్న ఒక శిక్షక హెలికాప్టర్ పైలెట్‌ను బెదిరించి తమ బందీగా చేసుకున్నారు. కొందరికి ట్రైనింగ్ ఇచ్చేందుకు వేచిచూస్తున్న ఈ పైలెట్  ఈ గ్యాంగ్ వచ్చి బెదిరించడంతో చేసేది లేక వారు చెప్పినట్లుగా హెలికాప్టర్‌ను జైలు వద్దకు తీసుకువెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీనితో చేసేది లేక హెలికాప్టర్‌ను అక్కడికి తీసుకువెళ్లడంతోనే నల్లటి దుస్తులలో ముఖానికి ముసుగులతో ఉన్న ఈ  సాయుధ వ్యక్తులు జైలులోకి దూసుకువెళ్లారు.

Comments

comments