ఎల్బినగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ పరిధి ఫతుల్లాగూడలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ భూమిలో మాజీ రౌడీషీటర్ రాములు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్నిశవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.