Home తాజా వార్తలు పెళ్లి బృందంపై కత్తులతో దాడి

పెళ్లి బృందంపై కత్తులతో దాడి

                   Man-Cuts-Throat-With-Knife

రాజన్న సిరిసిల్ల: నెహ్రూనగర్ లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి బరాత్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి పెళ్లి బృందంపై రౌడీ షీటర్ మోయిజ్ కత్తులతో దాడి చేశాడు. ఇద్దరిని కత్తులతో పొడవగా ఒకరి పరస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మోయిజ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.