Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నిందితులను కఠినంగా శిక్షించాలి

ph

కాగజ్‌నగర్ : బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన  దళిత మహిళ దుర్గం శ్రావంతను నిద్రిస్తున్న సమయంలో  అర్దరాత్రి కిరోసిన్ పోసి నిప్పంటించిన నిందితులను కఠనంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి, భారత కమ్యూనిస్టు పార్టి(సిపిఐ) నాయకులు డిమాండ్ చేశారు.  బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో  ముఖ్యఅతిధిగా పాల్గొని సిపిఎం పార్టి నాయకులు , మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, దివంగత పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రిటైర్డ్ తహసీల్దార్ సుభాష్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు,  సిపిఎం జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు.  జనవరి 25వ తేదిన దుర్గం శ్రావంత ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పటించి, సిలెండర్ పేలి నిప్పంటుకొని ఇల్లు కాలిపోయిందని, అధికార పార్టి నేతల సృష్టించారన్నారు.   అది వాస్తవం కాదని, మంటలో గ్యాస్ సిలిండర్ పేలిందన్నారు.  అధికార పార్టి నేతల అగడాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చక చెలరెగి పోతున్నాయన్నారు.  దళితులపై అధికార పార్టీ నేతల అగడాలు ఎక్కువ అయ్యాయన్నారు.  అనంతరం ఆర్డీవో కార్యాలయంలో దుర్గం శ్రావంత మరణానికి కారకులైన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తు ధర్నా చేశారు.  ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.  నాలుగు సంవత్సరాల క్రితం బషరాత్‌ఖాన్ అనే వ్యక్తికి అప్పు ఇచ్చి తిరిగి అప్పును అడిగినందుకు దళిత మహిళ నిద్రిస్తున్న సమయంలో  కిరోసిన్ పోసి నిప్పంటించారని, దళిత మహిళను హత్యచేసిన నిందితులను విచారణ జరిపించి కఠినంగా శిక్షంచాలని అన్నారు.  దళిత మహిళ కుటుంబానికి 25లక్షల పరిహారంతో పాటు  మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,  డబుల్ బెడ్‌రూం ఇల్లు వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  దళిత మహిళ హత్యపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో జిల్లా ఎస్పీ, డీజీపీ, డీఐజీకి వినతి పత్రం అందజేస్తామన్నారు.  న్యాయం జరగని పక్షంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు దగ్గరికి  అన్ని పార్టీ నాయకులు  దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, సిపిఎం, సిపిఐ పార్టి నాయకులు అంతా కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు  గనేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు , ఉపాధ్యక్షులు అచ్చెపల్లి బాబు, ఏఐటీవీసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు నెరెళ్ళ దివాజీ, అంబాల ఓదేలు, జిల్లా యువజన సంఘం నాయకులు ,దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments