Home జాతీయ వార్తలు విమర్శలతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

విమర్శలతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

 వీడ్కోలు ప్రసంగంలో ఉప రాష్ట్రపతి అన్సారీ,  మైనార్టీల అభద్రతపై ఆందోళన

                         Rajya-sabha

న్యూఢిల్లీ:  విమర్శలు లేకపోతే ప్రజాస్వామ్యం కాస్తా ని యంతృత్వంగా మారుతుందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చెప్పారు. ప్రభుత్వ విధానాలపై స్వేచ్చాయుత, నిర్మోహమాట విమర్శలు ఉండాల్సిందేనని, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇవే మూలమని స్పష్టం చేశారు. దేశ ఉపరాష్ట్రపతిగా, ఎగువ సభ ఛైర్మన్‌గా దశాబ్దకాలం ఉండి పదవి నుంచి వైదొలుగుతున్న చివరి రోజున గురువారం  ఆయన  రాజ్యసభలో తుది ప్రసంగం చేశారు. మాట్లాడారు. ఎగువసభగా రాజ్యసభపై గురుతర బాధ్యత ఉందని, దేశ బహుళ సంవిధానాన్ని ప్రతిబింబించే రాజ్యాంగపు సృష్టి అని కితాబు ఇచ్చారు.

ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు సహేతుకంగా, నిర్మొహమాటంగా విమర్శించేందుకు ప్రతిపక్షాలకు వీలుండాలని, ఇందుకు అన్ని విధాలుగా అవకాశం కల్పించాల్సి ఉంటుందని, లేకపోతే ప్రజాస్వామ్యం కాస్తా నిరంకుశత్వంగా మారుతుందని సర్వేపల్లి రాధాకృష్ణన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. పార్లమెంట్ సజావుగా సాగడంలో అన్ని పక్షాలూ సహకరించాల్సి ఉందని, విమర్శల స్థాయి సభా సంప్రదాయాన్ని కించపరుస్తూ, సభను అడ్డుకునే స్థితికి చేర్చరాదని స్పష్టం చేశారు. మైనార్టీల పరిరక్షణ ప్రజాస్వామిక ప్రక్రియకు ప్రత్యేకతను సంతరించిపెట్టిందని, అయితే ఇదే సమయం లో దేశం పట్ల ప్రజాస్వామ్యం పట్ల మైనార్టీలకు కూడా త గు బాధ్యత ఉందని తెలిపారు. ఏ  చట్టం అయినా చర్చలు తద్వారా దక్కే ఏకాభిప్రాయంతో రూపొందాల్సి ఉంటుం ది. హడావిడిగా చట్టాలు తీసుకువచ్చే ప్రక్రియను సభ్యులు అడ్డుకోవల్సిందేనని అన్సారీ తెలిపారు.

అన్సారీపై ప్రముఖుల ప్రశంసలు

రాజ్యసభ హుందాగా సాగడం లో అన్సారీ కీలక పాత్ర వ హించారని, దౌత్యవేత్తగా ఆయనకు ఉన్న గత అనుభవం ఇందుకు దోహదం చేసిందని తాను భావిస్తున్నట్లు ప్రధా ని మోడీ తెలిపారు. అన్సారీకి సంపూర్ణ ఆరో గ్య ఆయుష్షులు కలుగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో అధికార పక్ష నేత, మంత్రి జైట్లీ మాట్లాడుతూ అన్సారీ హయాంలో అత్యున్నత ప్రమాణాల చర్చలు జరిగాయని, అదే సమయంలో సభ కు ఆటంకాలు కూడా ఏర్పడ్డాయని తెలిపారు. పదవీ నుంచి వైదొలుగుతున్న ఆయనకు వీడ్కోలు చెపుతున్నామని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  మాట్లాడుతూ అన్సారీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.  ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ సభను సజావుగా నడిపించిన ఘనత అన్సారీకి దక్కుతుందని తెలిపారు. ఆయనతో తనకు చిరకాల సాన్నిహిత్యం ఉందని గుర్తుచేశారు. టిఎంసి నేత డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ అన్సారీ ఆరోగ్య పరిరక్షణ అలవాట్లు ఉత్తమమమైనవని, యోగా చేస్తారు, వాకింగ్‌కు వెళ్లుతారు. గత 4౦ ఏళ్లుగా మ ధ్యాహ్న భోజనంగా కేవలం సాండ్‌విచ్ తీసుకుంటూ వచ్చారని, ఇది బహుశా ప్రపంచరికార్డు కావచ్చు అన్నా రు. రాజ్యసభ టీవీ ఛానల్ ఏర్పాటులో అన్సారీ పాత్ర అభిందననీయం అని సిపిఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు.

అన్సారీపై బిజెపి మండిపాటు

మైనార్టీలలో అభద్రతా భావం ఉందని ఉప రాష్ట్రపతిగా వైదొలుగుతున్న అన్సారీ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని బిజెపి విమర్శించింది. ఓ టీవీ ఛానల్‌కు అన్సారీ ఇచ్చిన ఇంటర్వూలో మైనార్టీలు ఆందోళన చెం దుతున్నారని పేర్కొనడంపై బిజెపి స్పందించింది.  రిటైర్మెం ట్ తరువాత కూడా ఏదో రాజకీయ పునవారాసాన్ని ఆశిం చే ఆయన ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలకు దిగారని బిజెపి ప్రతినిధి కైలాష్ విజయ్‌వార్గియా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను బిజెపి ఖండిస్తోందన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.