Home తాజా వార్తలు రాంపూర్ చెరువులో భారీ మొసలి

రాంపూర్ చెరువులో భారీ మొసలి

Crocodile findout in the Rampur Pond

వరంగల్ రూరల్ : నల్లబెల్లి మండలం రాంపూర్ శివారులో ఉన్న చెరువులో ఓ భారీ మొసలిని స్థానికులు గమనించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువులో మరమ్మతులు చేస్తుండగా మొసలి కనిపించింది. బురదలో కూరుకపోయిన మొసలిని డోజర్ సాయంతో బయటకు తీశారు. అటవీశాఖ అధికారులు ఈ మొసలిని పాకాల చెరువులో వదిలారు.

Crocodile findout in the Rampur Pond