Home అంతర్జాతీయ వార్తలు కాలింగ్ బెల్ కొట్టిన మొసలి (వీడియో)

కాలింగ్ బెల్ కొట్టిన మొసలి (వీడియో)

Crocodile

అమెరికా: ఓ ఇంటి వద్దకు వచ్చి మొసలి కాలింగ్ బెల్‌ కొట్టిన సంఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలో చోటు చేసుకుంది.  వినడానికి వింతగా అనిపించినా అది నిజం. వివరాలలోకి వెళితే…  కరెన్ అల్ఫానో అనే మహిళ ఇంటి ముందుకు ఓ మొసలి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది.  కాలింగ్ బెల్ విన్న ఆమె డోర్ దగ్గరికి వచ్చి  ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారని కిటికీలోంచి చూసింది.బయట ఉన్న వారిని చూసి ఆమె షాక్ తిన్నది. ఎందుకంటే బయట కాలింగ్ బెల్ కొట్టింది మనిషి కాదు ఓ మొసలి.తలుపు తీసుంటే నా గుండె అక్కడే ఆగిపోయేది అనుకుంది. కొద్దిసేపు తర్వాత తేరుకున్నాక తను చూసింది నిజమే అని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు జంతు సంరక్షణా సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు,సంరక్షణా సిబ్బంది  మొసలిని చాకచక్యంగా పట్టుకొని నీటిలో వదిలేశారు. ఈ తతంగం అంతా ఇంటి ముందు ఉన్న సిసిటివి లో రికార్డ్ అయింది.  దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Crocodile rings calling bell in America