Home తాజా వార్తలు ఆనాటి మొసళ్లు కొన్ని శాకాహారులే

ఆనాటి మొసళ్లు కొన్ని శాకాహారులే

Crocodilesవాషింగ్టన్ : డైనోసార్ల యుగంలో మొసళ్లు కూడా సంచరించేవి అనడానికి వాటి శిలాజాలే సజీవ సాక్షాలుగా అభివర్ణిస్తుంటారు. మొసొజోయిక్ యుగం లోకి తిరిగి వెళ్ల గలిగే కాలయంత్రాన్ని కనుగొనగలిగితే అప్పటి మొసళ్ల ఉనికి వాటి అలవాట్లు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏదేమైనా ఆనాటి మొసళ్లు అన్నీ మాంసాహారి కావని, వీటిలో కొన్ని శాకాహారిగానే జీవించాయని నిర్ధారించడానికి శిలాజాల సాక్షాలు కొన్ని ధ్రువీకరిస్తున్నాయి. సెల్‌ప్రెస్‌లో ఇటీవల ఈ మొసళ్ల గురించి అధ్యయనం వెలువడింది.

ఈ అధ్యయనం ప్రకారం అంతరించిపోతున్న 16 మొసళ్ల తెగల దంతాలకు సంబంధించిన 146 దంతాల హైరిజల్యూషన్ స్కాన్లను కంపూటర్ నమూనాల ద్వారా పరిశీలిస్తే ఆధునిక యుగం నాటి మొసళ్ల సంతానానికి భిన్నంగా ఆనాటి మొసళ్లు భయంకరంగా కాకుండా ప్రశాంతంగా జీవించేవని తెలుస్తోంది. అంటే ఇప్పటి మొసళ్ల దంతాల వలె కాకుండా వాటి దంతాలు మరోలా ఉన్నాయని యూనివర్శిటీ ఆఫ్ యుటాకు చెందిన విద్యార్థి కీనన్ మెల్‌స్టార్మ్ చెప్పారు. ఆనాటి మొసళ్లు ఏం ఆహారం తీసుకొనేవో ఆ దంతాలు వెల్లడిస్తున్నాయి. క్షీరదాల వారసత్వం పైన, సరీసృపాల్లోని దంతాల్లో తేడాల పైన గతంలో చేసిన పరిశోధనల ఆధారంగా మొసళ్ల దంతాల శిలాజాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. కొన్ని తెగల మొసళ్లు ఈనాటి మొసళ్ల వలె కనిపించాయి. అయితే ఇవి మొదట్లో మాంసాహారిగానే ఉన్నాయి.

మరికొన్ని అన్ని రకాల ఆహారాలను తీసుకునేవని వెల్లడైంది. ఆహారం కోసం మొక్కలపై ఆధారపడి జీవించే మొసళ్లు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఈ రకం మొసళ్లు వేర్వేరు ఖండాల్లో వేర్వేరు కాలాల్లో జీవించేవని తెలుస్తోంది. ఇప్పటి మొసళ్ల వలె కొన్ని కనిపించినా మరి కొన్ని చిన్న సైజులో ఉభయచరాలుగా కాకుండా పూర్తిగా నేలపైనే జీవించేవని వాటి కాళ్లు శరీరం అడుగున దాగి ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. సృష్టి పరిణామం మొక్కలపై ఆధారపడే శాకాహారులుగా కొన్ని మొసళ్లను ఎలా మార్చిందో అవి ఎందుకు అదృశ్యమయ్యాయో చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. క్షీరదాలు లేకపోవడం వల్లనే అవి శాకాహారులుగా మారి ఉండవచ్చని కొందరు భావిస్తుండగా, కొన్ని తెగలు క్షీరదాలతోపాటు సమాంతరంగా జీవించి ఉండవచ్చని మరి కొందరు భావిస్తున్నారు.

Crocodiles of Old Were Vegetarians