Search
Wednesday 21 November 2018
  • :
  • :

పేగుల్లో క్రాన్స్ జబ్బు..

Crohns Disease Symptoms

తరచుగా విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవటం, బలహీనత. ఇలా పెద్దపేగులో తలెత్తే ‘క్రాన్స్ డిసీజ్’ బారినపడ్డవారి బాధలు చాలానే ఉన్నాయి. ఇది ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియదు. కొన్ని జన్యువులు, ఆహార పరమైన అంశాలు దీనికి దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. పేగుల్లో బ్యాక్టీరియాకు దీంతో సంబంధం ఉంటున్నట్టూ బయటపడింది. అయితే పేగుల్లోని ఫంగస్ సైతం క్రాన్స్ జబ్బు తలెత్తటంలో పాలు పంచుకుంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. క్రాన్స్ డిసీజ్ బాధితుల మలం నమూనాలను పరిశీలించగా.. ఇ.కొలి, సెరాటియా మార్కెసెన్స్ బ్యాక్టీరియాలతో పాటు క్యాండిడా ట్రోపికలిస్ అనే ఫంగస్ కూడా పెద్దమొత్తంలో ఉంటున్నట్టు వెల్లడైంది. పైగా ఈ మూడు కలిసి పేగుల లోపలి గోడకు అంటుకుపోయి మందమైన పొరలా ఏర్పడుతుండటం గమనార్హం. ఈ పొర వాపు ప్రక్రియను ప్రేరేపించి క్రాన్స్ లక్షణాలు విజృంభించటానికి దారితీస్తున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. క్రాన్స్ జబ్బుకు కొత్త చికిత్సలను రూపొందించటానికిది దోహదం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు.

Crohns Disease Symptoms

Telangana News

Comments

comments