Home జయశంకర్ భూపాలపల్లి అకాల వర్షం… అపార నష్టం

అకాల వర్షం… అపార నష్టం

Crop damage to farmers

 

టేకుమట్ల: మండలంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లింది. మండలంలోని ఎంపేడు, వెల్లంపల్లి, గుమ్మడవల్లి, రాఘవరెడ్డిపేట గ్రామాలలో ఇందిరాక్రాంతి పథం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిచినట్లు ఆయా గ్రామాల రైతులు తెలిపారు. ఈ అకాల వర్షంతో రబీ పంటలైన పసుపు, మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు చేతికి వచ్చిన తర్వాత వర్షంలో తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి సరైన మద్దతు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం వరికి ఎకరానికి రూ.20వేలు, పసుపు, మిర్చి, ఇతర పండ్లు, కూరగాయలు పండించే రైతులకు ఎకరాకు రూ.15వేల చొప్పున నష్టపరిహారం కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం వ్యవసాయశాఖ ద్వారా పంట నష్ట సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటున్నారు.

Crop damage to farmers with Premature rain