Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పంటల బీమా… రైతుకు ధీమా

 Crop Insurance Support To Farmers In Nizamabad Dist

మనతెలంగాణ/ నిజామాబాద్‌రూరల్ : ఆరుగాలం కష్టించి వేసుకున్న పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం బీమా పథకంతో రైతులకు ధీమా కల్పిస్తుంది. బీమా చేయించడంలో ఆర్థికంగా నష్టపోకుండా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసింది. మామిడికి వర్షాధారిత బీమా ఇతర పంటలకు ఫసల్ బీమా పథకం గత ఏడాది ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బీమా చేసుకుని పరిహారం పొందేందుకు పత్తికి జూలై 15, ఎర్ర మిరప జూలై 31, ఆయిల్‌పామ్ జూలై 14, బత్తాయి ఆగస్టు 9 వరకు గడువు ఉంది. అలాగే జొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాబిన్, పసుపులకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. వరి పంటకు ఆగస్టు 31వరకు గడువు ఉంది. ఇందుకు రైతులు వరిపంట హెక్టరుకు రూ. 1700రూ, జొన్నకు 800, మొక్కజొన్నకు 1000రూ. పత్తి 4375, కంది 700, పెసరకు 750, సోయాబిన్ 900, బత్తాయి 5625, పసుపుకు 7500, రూపాయల చొప్పున రైతులు హెకార్టుకు నిర్ణిత ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. వీటికి పంటరుణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఒక హెక్టారుకు రైతులు చెల్లించిన ప్రీమియం శాతంతో 1,45,000, పత్తికి 87500, మొక్కజొన్నకు 50వేలు, వరికి 85వేలు, కందికి 35వేలు, సోయాబిన్‌కు 45వేలు, పెసరకు 37వేల 500, జొన్నకు 40వేలు, మినుము 35వేలు, బత్తాయి 1లక్ష 12వేల500, పసుపు 1లక్ష50వేలు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లిస్తారు.
* మామిడికి వర్షాధారిత బీమా :
మామిడిలో ప్రకృతి వైపరీత్యాలకు అధికంగా నష్టపోతున్నారు. మామిడి తోటలు ఉన్న రైతులు 5నుండి 15 యేళ్ల మధ్య ఉన్న ప్రతి చెట్టుకు రూ. 23 చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాలతో మామిడి పంటకు నష్టం కలిగితే ప్రతి చెట్టుకు రూ. 450 పరిహారం బీమా ద్వారా అందిస్తాం. 15 నుండి 50యేళ్ల మధ్య గల మామిడిచెట్టుకు రూ. 43 ప్రీమియంను చెల్లించాలి. పరిహారంగా చెట్లకు 850రూ. చొప్పున బీమా ద్వారా అందిస్తారు.
* ఇలా చెల్లించవచ్చు : పంటల రుణాలు పొందే రైతులు నేరుగా బీమా ప్రీమియం డబ్బులను బ్యాంక్ నుంచే బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది. సదరు రైతులు పంటలు సాగు చేసే వివరాలను బ్యాంకుల్లో అందించాలి. రుణం తీసుకొని రైతులు నేరుగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా, యూనైటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనిపై గడువులోగా డిడిని తీసి సమర్పించాలి. ప్రీమియం చెల్లించే రైతులకు సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపాలి. పంటసాగు చేస్తున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారిచే ధృవీకరించాలి. విఆర్‌ఓ ధృవీకరించిన పత్రాలను వ్యవసాయాధికారులు పరిశీలించి ధృవీకరించనున్నారు. నిర్ణీత సమయంలో పంటల ప్రీమియం చెల్లించిన ప్రతిరైతుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలు వర్తిస్తాయి.
* నష్ట పరిహారం ఇలా : ఈ పథకం గాలి, వాన వడగళ్లవాన, తుఫాను, అతివృష్టి, అనావృష్టి, వరదలు, నీట మునిగిపోవడం, అగ్ని ప్రమాదం, పిడుగుపాటు తదితర వాటి వల్ల దిగుబడులకు నష్టాలు కలిగితే పంట ద్వారా వచ్చే దిగుబడి ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు. వరిసాగులో ఉన్న విస్తీర్ణంలో 75 శాతానికి నాట్లు వేయకపోతే కలిగే ఆర్థిక నష్టాలకు బీమా చేసుకున్న రైతులకు బీమా మొత్తంలో 25 శాతం వరకు నష్టపరిహారం కింద చెల్లిస్తారు. పంట మధ్య కాలంలో నష్టపోతే అంచనా వేసిన పరిహారంలో 25శాతం రైతులకు ముందస్తుగా చెల్లిస్తారు. పంట కోసిన 14 రోజుల వరకు తుఫాను అకాల వర్షంతో పంట దిగుబడికి నష్టం కలిగితే నష్ట పరిహారం అంచనా వేసి షరతులతో చెల్లిస్తారు.

Comments

comments