Home తాజా వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు : 11మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు : 11మంది మృతి

Maoists

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. సూక్మా జిల్లా బెజ్జి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన మరో ముగ్గురు జవాన్లను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్విహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జరిగిన ఘటన గురించి ఆయన కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆయన రాజ్‌నాథ్‌ను ఆదేశించారు. రాజ్‌నాథ్ శనివారం ఘటనాస్థలికి వెళ్లనున్నారు.