Home జాతీయ వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… మావో అర్జున్ హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… మావో అర్జున్ హతం

naxals-torched-image-done-iరాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్-ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుమారు గంటకుపైగా జరిగిన కాల్పుల్లో చందోమేటా ప్రాంతానికి చెందిన జన్‌మిలీషియా కమాండర్ అర్జున్ హతమయ్యారు. ఈ నెల 10 నుంచి పోలీసులు తులసి డోంగ్రీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, మృతిచెందిన మావో 108 అంబులెన్స్ పేల్చివేత, ఐదుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులు, మాజీ సర్పంచ్ హత్య కేసుల్లో నిందితుడని భద్రతాధికారులు తెలిపారు. అంతేగాక తాజాగా ఈ నెల 10న ఓ గ్రామస్తుడిని కూడా హత్యచేసినట్లు తెలుస్తోంది. మావోల ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలో రక్షణ దళాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.