Home దునియా మనసంతా సంతోషం

మనసంతా సంతోషం

Crow-Parrot

 

సదానందం ఆశ్రమానికి వెళ్ళేదారిలో ఉన్న చెట్టు మీద ఒక కాకి ఉంది. ఆశ్రమానికి వెళ్లే భక్తులు గారెలు బూరెలు తీసుకెళ్లడం చూసిన కాకికి నోరూరేది. ఆశ్రమానికి వచ్చే భక్తులు ఇచ్చే గారెలు, బూరెలను సాధువు ఇతర భక్తులకు ఇచ్చే వారు. భక్తులు తృప్తితో ఇంటికి తీసుకెళ్లి ఆరగించేవారు.  భక్తులకు, సాధువుకు, సాధువు శిష్యులకు, నేను కనబడలేదు. ఒక్కరుకూడా నాకు ఇష్టమైన గారెలు బూరెలు ఇవ్వలేదు చిలుకా..బాధగా అంది కాకి.  నీకు నిజంగా గారెలు బూరెలు అంటే అంత ఇష్టమా” అడిగింది చిలుక.

నీకు జామపండ్లు అంటే ఎంత ఇష్టమో నాకు అవంటే చచ్చేంత ఇష్టం. కడుపునిండా తినడానికి సిద్ధమే… కడుపు నిండక పోతే పోనీ నోటికి ఒక్కటి కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదు” అంది కాకి. కాకి మిత్రమా నీకు నిజంగా వాటిని తినాలనిపిస్తే నేను చెప్పింది చేస్తే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది”

“చిలకా నేనేమి చెయ్యాలో చెప్పు”

“సాధువు ధ్యానం చేసే సమయంలో అతని దగ్గర ఎవ్వరూ ఉండరు. నీవు అతని ముందు కూర్చో. అతనే నీ కోరికను అర్థం చేసుకొని నీ కోరిక నెరవేరేలా చేస్తాడు” అంది చిలుక.

సదానందం ధ్యానం చేస్తున్న సమయాన కాకి వెళ్లి అతనికి కొద్ది దూరంలో కూర్చుంది. ధ్యానం ముగించుకొని కళ్ళుతెరచి ఎదురుగా కూర్చున్న కాకిని చూడగానే, సాధువు తన కోరికను తెలుసుకొని “ఓ కాకి నీ మనసు సంతోషంతో నిండుతుంది భక్తులు రావడంతో” అన్నాడు. ధ్యానం ప్రారంభించగానే కాకి ఎగురుకుంటూ చెట్టుపైకి వచ్చి కూర్చుంది.
ఆశ్రమం నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న తండ్రీ కొడుకులు చెటు ్టకింద భిక్షగాడిని చూశారు. ప్రసాదంగా ఇచ్చిన గారెలు బూరెలు తీసి ఆ భిక్షగాడికి ఇచ్చారు.

“ రామయ్యా, సాధువు మనకు ప్రసాదంలా ఇచ్చిన వాటిని నీవు ఇలా భిక్షగాడికి ఇవ్వడం నాకు నచ్చలేదు”
“ నాన్నా, ఆ ప్రసాదం మనం తినడం కన్నా ఇతరులకు ఇస్తే పుణ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుంది.” అన్నాడు.
కొడుకు మాటల్లో నిజాన్ని గుర్తించి మెచ్చుకొంటున్నట్టుగా భుజంపైన మెల్లగా తట్టాడు. జరుగుతున్నదంతా చెట్టు పైన కూర్చున్న కాకి చూసింది.

కొంత సేపటికి భిక్షగాడు ఆకుల్లోనున్న గారెలు తీసుకొని తినడానికి ముందు ఒక గారెను చేతితో తీసుకొని కాకికి చూపిస్తూ చెట్టుదగ్గర ఉంచాడు. కాకి గారెను తీసుకొని చెట్టుపైన కూర్చుని ఒక్క క్షణం ఆలోచించింది. పక్క చెట్టుపై కూర్చొని ఉన్న ముసలికాకికి ఇవ్వగానే , అది ఆవురావురంటూ తినడం చూస్తున్న కాకికి కడుపు నిండినట్లు మనసంతా సంతోషంతో నిండిపోయినట్లనిపించింది.

ఓట్ర ప్రకాష్ రావు
97874 46026

 

Crow and Parrot Story in Telugu