Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

టిక్కెట్ ప్లీజ్ ! (వీడియో)

Ticket

కాకులు చాలా తెలివైన పక్షులు. అవి మనుషుల్ని అనుసరిస్తాయట. ఇంతవరకు బాగానే ఉంది. క్రెడిట్ కార్డును దొంగిలించి మరీ ట్రైన్  టిక్కెట్ కొనడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంత అర్జంటుగా ఇది ఎక్కడికి వెళ్లాలో పాపం అనుకుంటున్నారు జనాలు. ఈ నెల మొదటివారంలో జరిగిన ఈ వింత సంఘటన సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పక్షులకు రెక్కలుంటాయి కాబట్టి హాయిగా ఎగురుకుంటూ ఎక్కడికైనా పోవచ్చు. వాటికి టిక్కెట్లు, వీసాలతో పనుండదు. కానీ ఇదేంటి ఈ కాకికి టిక్కెట్ అవసరం ఎందుకొచ్చిందంటూ చెవులు కొరుక్కుంటున్నారు జపాన్‌వాసులు.  ఎప్పుడూ ఎగురుకుంటూ వెళ్లడమేనా..నాకు మాత్రం చక్కగా సీట్‌లో కూర్చుని ప్రకృతి ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుండదా అనుకుందేమో ఈ కాకి. ట్రైన్ టికెట్ కోసం లైన్‌లో  ఉన్న మనుషుల్ని తోసుకుంటూ టికెట్ మిషన్ దగ్గరకు వెళ్లింది.

టికెట్ కోసం తెగ ప్రయత్నించింది. కొన్ని సెకన్ల తర్వాత విసుగెత్తింది. కాసేపు మనుషుల్ని పరిశీలించింది. వాళ్లేదో కార్డు పెట్టి టికెట్ తీసుకోవడం గమనించింది. అంతే దానికి బల్బ్ వెలిగింది. అక్కడే కార్డు పట్టుకుని ఉన్న ఓమహిళ చేతిలోని కార్డును చప్పున తీసుకుంది. వెంటనే దాన్ని మెషిన్ లోపలికి పెట్టి టికెట్ తీసుకుంది. అప్పటి వరకు ఆ మహిళ ఎంతో ఓపిగ్గా వెయిట్ చేసింది. మళ్లీ అంతే మర్యాదగా ఆమెకు ఆ క్రెడిట్ కార్డును ఇచ్చేసింది. ఇదంతా అక్కడే ఉన్న కినోషిటా షోజి అనే వ్యక్తి తన ఫోన్‌లో బంధించి  ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.  ఇంతకీ అది ఎక్కడి వరకు టిక్కెట్ తీసుకుందో మాత్రం ఎవరికీ తెలియదు.

Comments

comments