Search
Friday 21 September 2018
  • :
  • :

పదహారేళ్ల ప్రాయం కీలకం: మోడీ

ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా అంతే
దేవభూమిని అపవిత్రం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు

modiహరిద్వార్: యవ్వనంలో ఉన్న పదహారేళ్ల వారికి ఆ ప్రాయం ఎంత కీలకమైందో అదే విధంగా ఉత్తరాఖండ్‌కు తదుపరి ఐదేళ్లు అంతే కీలకమైన వని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇక్కడ అన్నారు. ‘దేవభూమిని అపవిత్రం చేసిన’ ప్రభు త్వాన్ని గద్దె దించాలని ఆయన ఓటర్లను కోరారు. దాని స్థానంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దూరదృష్టిని నిజంచేస్తూ అభివృద్ధి పథకాలను అమలుచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవల సిందిగా ప్రధాని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో పదహారవ సంవత్సరం చాలా ముఖ్యమైంది. తదుపరి ఐదేళ్లు రాగల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇప్పుడు ఉత్తరా ఖండ్ ఏర్పాటై కూడా పదహారేళ్లయ్యింది. ఇక ముందు రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందో వచ్చే ఐదేళ్లు నిర్ణయిస్తాయని ఇక్కడి రిషికుల్ మైదాన్‌లో జరిగిన పార్టీ విజయ్ సంకల్ప్ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో అవినీతిని రుజు వు చేయడానికి కోర్టుల దాకా వెళ్లనక్కరలేదని, ఇక్కడ జరుగుతున్న తంతును దేశ ప్రజలందరూ టెలివిజన్‌లో చూశారని ఆయన అన్నారు. ‘గతం లో దేవభూమిని గురించిన ప్రస్తావన వస్తే పవిత్ర భావం కలిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు ఆ ప్రస్తావన తెస్తే మచ్చపడిన ప్రభుత్వం గుర్తుకు వస్తుందని, అవినీతి బాగోతాన్ని దేశ ప్రజలందరూ టెలివిజన్‌లో చూశారని ఆయన అన్నారు. దేవభూమికి మచ్చతెచ్చిన ప్రభుత్వాన్ని ఓడించరా? అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఊహల్లో ఆవిష్కృతమైన ఉత్తరాఖండ్‌ను నిజం చేసే పనిని చేపట్టానని ప్రధాని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఉత్తరాఖండ్ గౌరవాన్ని కాపాడే బిజెపి ప్రభుత్వా న్ని గద్దెనెక్కించాలని ప్రధాని కోరారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని గురించి మాట్లా డుతూ, ఇప్పటి కీ కొంతమందికి నిద్రపట్టడం లేదని, తమ నల్లధ నం మొత్తం బ్యాంక్ ఖాతాల్లోకి చేరిపోవడంతో వారికి దిక్కు తోచడం లేదని ఆయ న అన్నారు. వారి నల్లధనం వ్యాపారం అంతా బ్యాంక్ ఖాతా ల పరం అయిపోయిందని అన్నా రు. బాంక్‌లో డిపాజిట్ చేసిన సొమ్ము ‘ఎక్కడి నుంచి వచ్చింది. ఎంత వచ్చింది. ఎవరు తెచ్చా రు. ఎలా తెచ్చారు. వంటి అంశాలన్నీ ఇప్పుడు కెమెరాలలో చిక్కాయ ని, అందుకే చాలా మందికి నిద్రపట్టడం లేదని ఆయన అన్నారు.

Comments

comments