Home తాజా వార్తలు 70 డాలర్లకు తగ్గిన బ్యారెల్ చమురు

70 డాలర్లకు తగ్గిన బ్యారెల్ చమురు

Crude Oil Dips Below $70 Per For First Time Since April

లండన్ : ఎట్టకేలకు చమురు ధరలు దిగివచ్చాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లకు తగ్గింది. అక్టోబర్ నెలలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న చమురు ధరలు.. ఇప్పుడు 18 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా సరఫరా పెరగడంతో క్రూడ్ రేట్లు క్షీణిస్తున్నాయి. గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దిగుమతి దేశాలు ఆందోళన చెందాయి. ఈ కారణంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఇటీవల అంతర్జాతీయ ము డి చమురు ధరలు తగ్గుతుండడంతో దేశీయంగా కూడా చము రు ధరలు తగ్గాయి.

శుక్రవారం ఉదయం లండన్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 96 సెంట్లు పడిపోయి 69.69 డాలర్లకు చేరింది. అమెరికా చమురు నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో ఒపెక్ దేశాలు ఈ వారాంతంలో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ముడి చమురు ధరల తగ్గింపు అవకాశాలపై ఒపెక్ దేశాలు చర్చించనున్నాయి. గతంలో ముడి చమురు ధరల పెరగడంతో మన దేశంలో దాదాపు పెట్రో ల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అదే సమయంలో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు విధింపు పలు దేశాలు ఆందోళన చెందాయి. అయి తే కొన్ని దేశాలకు ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపు ఇచ్చింది. కాగా ఒపెక్ సమావేశం నేపథ్యంలో త్వరలో ధరలు మరింతగా దిగివచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

Crude Oil Dips Below $70 Per For First Time Since April

Telangana Latest News