Home మంచిర్యాల ఆరోగ్యంతో చెలగాటం

ఆరోగ్యంతో చెలగాటం

Food

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం విషయంలో అధికారులు నిర్లక్ష్య దోరణి వీడడం లేదు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించాల్సిన వ్యాపారులు ధనార్జనే లక్ష్యంగా నాసిరకం వంటకాలతో దోపిడికి పాల్పడుతూ మరోవైపు ప్రజల ఆరోగ్యా లతో చెలగాటం ఆడుతున్నారు. బాధ్యత గల అధికారులు ఈవిషయంలో చూసి చూడనట్లు మామూలుగా వ్యవహరిస్తున్నారు. కలుషిత పదార్ధాల ప్రజలు ఇబ్బందు లు పడుతుండగా పలు సందర్భాలలో వడ్డించిన వంటకాల్లో పురుగులు వెంట్రుకలు రావడంతో వినియోగదారులుగొడవకు దిగుతున్నారు. తూర్పు ప్రాంతంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తోంది.

నగరాలకు ధీటుగా జిల్లా కేంద్రంలో రెస్టారెంట్లు,హోటళ్లు వెలుస్తుండగా ప్రజలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించడం లేదని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ ప్రముఖరెస్టారెంట్‌లలో బిర్యాని వంట కాల్లో పురుగులు వెంట్రుకలు వచ్చాయంటూ వినియోగదారుడు ఆరోపిస్తూ హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగగా ఈ ఉదాంతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసి ంది. ఇదే రెస్టారెంట్‌లో ఈ సంఘటన రెండోసారి జరగడం గమనార్హం. అలాగే ప్రముఖ టిఫిన్ సెంటర్ హోటల్ కూడా గతంలో తినుబండరాల్లో పురుగులు రావడం గొడవలకు దారి తీసిన విషయం తెలిసిందే. హోటల్ నిర్వాహకులు నిల్వ ఉంచిన పదార్ధాలతో వంటలు చేసి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలువురు వాపోతున్నారు. బాధ్యత గల అధికారులు తనిఖీలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తుండడం పలు ఆరోపణలకు దారి తీస్తోంది.

చిరు వ్యాపారులు చేసే తినుబండరాల్లో నాణ్యతా లోపం
పట్టణ ప్రజలు సాయంద్రం వేలల్లో వేడి వేడి మిర్చి, బోండ, వడ, పానిపూరి, తదితర తినుబండరాలను తినేందుకు ఆసక్తి చూపుతుండగా వ్యాపారులు ఇదే అధనుగా నాసిరకం ఆహార పదార్ధాలతో దోపిడికి పాల్పడుతున్నారు. కలుషితమైన నూనెనే వాడుతూ తినుబండరాలు బహిరంగానే తయారు చేస్తుండడం గమనార్హం. ముఖ్యం గా ప్రదాన రహదారు సమీపంలోనే దూమ్ము దూళి మధ్యం తినుబండరాలు తయా రు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వేడి వంటకాల కోసం ఉవ్విళ్లు ఊరే జనాలకు కూడా కలుషి వంటకాలను పట్టించుకోకపోవడంతో చిరు వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వేల వరకు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు కొనసాగుతున్నప్పటికీ ఆహార భద్రత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.