Home IPL 2019 IPL 2019: చెన్నై లక్ష్యం 148

IPL 2019: చెన్నై లక్ష్యం 148

 

న్యూఢిల్లీ: ఐపిఎల్ 12వ సిజన్లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న 5వ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు, చెన్నైకి 148 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీషా మంచి ఆరంభాన్ని అందించాడు. దూకుడుగా ఆడుతున్న షా(24)ను దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18) తక్కువ పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

తర్వాత యువ ఆటగాడు రిషబ్ పంత్ వచ్చిరాగానే మరో ఓపెనర్ శిఖర్ ధవన్ తో కలిసి బౌండరీలతో రెచ్చిపోయాడు. అయితే బ్రావో బౌలింగ్ లో రిషబ్(25) భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. మొదటి నుంచి ఆచూతూచి ఆడుతూ వచ్చినా శిఖర్ ధవన్ హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది.

CSK vs DC: CSK Target 148 runs