Home IPL 2019 చెన్నై రెండో విజయం

చెన్నై రెండో విజయం

 

న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్12లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో రెండు బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 3 సిక్స్‌లు, 4ఫోర్లతో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోని 32 (నాటౌట్), రైనా (30) తమవంతు పాత్ర పోషించారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన షా ఐదు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ ఏడు బౌండరీలతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో ఢిల్లీ స్కోరు 147కే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టాడు.

CSK vs DC: CSK won by 6 wickets