Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పెరిగిన కరెంట్ ఖాతా లోటు

  • మూడో త్రైమాసికంలో 7.9 బిలియన్ డాలర్లు
  • జిడిపిలో 1.4 శాతంగా నమోదు : ఆర్‌బిఐ

economy

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్) కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 7.9 బిలియన్ డాలర్లతో(రూ.51,680 కోట్లు) పెరిగింది. అంతకుముందు 2015-16 సంవత్సరం ఇదే సమయంలో ఇది 7.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈమేరకు గురువారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వివరాలను వెల్లడించింది. సంవత్సరం-సంవత్సరం ఆధారంగా చూస్తే వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గింది. నికర వసూళ్లు పడిపోవడంతో కరెంట్ ఖాతా లోటు పెరిగిందని ఆర్‌బిఐ వెల్లడించింది. 2015 సంవత్సరం ఇదే త్రైమాసికంలో జిడిపి(స్థూల దేశీ యోత్పత్తి)లో కరెంట్ ఖాతా లోటు 7.1 బిలియన్ డాలర్లు (1.4 శాతం)గా ఉంది. జులై-సెప్టెంబర్‌లో జిడిపి 3.4 బిలియన్ డాలర్లు(0.6 శాతం)గా ఉన్నాయని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడించాయి. నికర వసూళ్లు మందగించాయని, ప్రధానంగా ఈసారి ఫలితాల్లో సాఫ్ట్‌వేర్, ఆర్థిక సేవలు నుంచి లాభాలు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ కరెంటు ఖాతా లోటు 1.4 శాతానికి పెరగొ చ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా అంచనా వేసింది. ఈ అంచనాల తగ్గట్టుగానే ప్రస్తుతం గణాంకాలు నమోదైనాయి. నోట్ల రద్దు తర్వాత ఎగుమతులు బాగా తగ్గిపోవడంతో పాటుగా దిగుమతులు పెరగడంతో నవంబర్ నెలలో వాణిజ్య లోటు పెరిగింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును ఇంతకు ముందు అంచనా వేసిన జిడిపిలో 0.4 శాతంనుంచి 1.4 శాతానికి సవరించినట్లు నోమురా వెల్లడించింది.

  • 2016-17 క్యూ3(మూడో త్రైమాసికం)లో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 7.9 బిలియన్ డాలర్లు(అంటే జిడిపిలో 1.4 శాతం) నమోదవగా, 2015-16 క్యూ3లో 7.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ముందు త్రైమాసికంలో 3.4 బిలియన్ డాలర్లతో జిడిపిలో 0.6 శాతం నమోదైంది.
  • సంవత్సరం-సంవత్సరం ఆధారంగా చూస్తే వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గినా క్యాడ్ పెరిగింది. దీనికి కారణం నికర వసూళ్లు పడిపోవడమే.
  • సంవత్సరం-సంవత్సరం ఆధారంగా చూస్తే నికర సేవల వసూళ్లు మందగించాయి. దీనికి కారణం సాఫ్ట్‌వేర్, ఆర్థిక సేవలు, మేధో సంపత్తి హక్కులకు చార్జీలు తగ్గుముఖం పట్టడమే.
  • ఆర్థిక ఖాతాలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016-17లో క్యూ3లో 9.8 బిలియన్ డాలర్లు.. సంవత్సరం క్రితంతో పోలిస్తే స్వల్పంగా దిగువన ఉన్నాయి.
  • వెనక్కివెళ్లిన పోర్ట్‌ఫోలియా పెట్టుబడులు 11.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
  • 2016-17 క్యూ3లో విదేశీ మారక నిల్వలు(బిఒపి ఆధారంగా) 1.2 బిలియన్ డాలర్లతో తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 4.1 బిలియన్ డాలర్లుగా

Comments

comments