Home వరంగల్ రూరల్ షాకిచ్చిన కరెంటు బిల్లు

షాకిచ్చిన కరెంటు బిల్లు

Current bill of 41288 rupees coming

మన తెలంగాణ/కమలాపూర్ : మనం కరెంటు తీగను పట్టుకుంటే షాకు వస్తుంది. కాని ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్షం మూలంగా కరెంటు బిల్లు పట్టుకుంటే కాదు చూస్తూంటేనే షాకోచ్చేలా ఉంది. వెయ్యి కాదు రెండు వేలుకాదు ఓ పేదోడి కుటుంబానికి ట్రాన్స్‌కో 41 వేల రూపాయల బిల్లు చేసి నిర్ఘాంత పోయేలా చేసిన సంఘటన కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కమలాపూర్‌కు చెందిన వేల్దండి లక్ష్మినారాయణ 4వ వార్డులోని పెంకుటింట్లో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నలక్ష్మినారాయణకు ప్రతి నెల 120 లేదా 150 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది. కాని 5రోజుల క్రితం ట్రాన్స్‌కో సిబ్బంది బిల్లు చేసిన వైనం బాధితున్ని షాక్‌కు గురి చేసింది. ఇంట్లోని రెండు బల్బులు ఒకే ఒక్క ప్యాన్‌కే 41288 రూపాయల బిల్లు చేసి ట్రాన్స్‌కోలీలను చాటుతున్నారు. కరెంటు బిల్లును చూసి నివ్వెర పోయిన లక్ష్మినారాయణ ఇదేంటని కరెంటుబిల్లు చేసిన వ్యక్తిని అడిగినా సరైన సమాధానం లేకపోయింది. దీంతో వారం రోజులుగా అధికారుల చుట్టు తిరుగుతున్న నిరుపేద ఇంత బిల్లు చేస్తే ఎలా కట్టేదంటూ లబోదిబోమంటున్నాడు. వేంటనే ట్రాన్‌సకో అధికారులు స్పందించి బిల్లును సవరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.