Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తొస్తాయి: హరీశ్ రావు

Current shortage of Congress are remembering Harish Rao

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో జరిగిన మంత్రుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గర్తుకు వస్తాయని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

‘‘దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. ఎన్నికల్లో హామి  ఇవ్వని అంశాలను కూడా నెరవేర్చాం. అంతేగాక రైతుబంధు, రైతు బీమా పథకాలను, నాలుగేండ్లలోనే 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించాడంతో మన  పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన కొన్ని గ్రామాలకు ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యైనా పూర్తిగా పరిష్కరించారా? కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? కాంగ్రెస్ పాలనే బాగుంటే ఈ సమస్యాలు ఎందుకు అలాగే ఉంటాయి అంటు విర్చుకుపడ్డారు. తెలంగాణ ఆరు దశాబ్దాల్లో ఎన్నాడు లేనంత ప్రశాంతంగా ఉంది. రైతులకు ఏ రాష్ట్రమైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా?” అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.

Comments

comments