Search
Wednesday 21 November 2018
  • :
  • :

తండ్రీకొడుకులను బలిగొన్న కరెంట్ వైర్లు

Current wires that are sacrificed by papa

ఫిర్యాదు చేసినా స్పందించని విద్యుత్ సిబ్బంది 

మన తెలంగాణ/ ఖమ్మం అర్బన్ : విద్యుత్తు శాఖాధికారుల నిర్లక్షంతో రెండు నిండు ప్రా ణాలు గాలిలో కలిసిపోయాయి. వైర్లు తెగిపడ్డాయని సమాచారం ఇచ్చినా అధికారులు స్పం దించకపోవడంతో విద్యుత్తు షాక్‌కు గురై తం డ్రి, కొడుకులు మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన రఘునాథపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్షంతో మృతి చెందారని మృతుల బంధువులు మృతదేహాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన ఐదవ వార్డు సభ్యులు బాదావత్ శంకర్ (42), అతని కుమారుడు వెంకటేష్ (18) చేలో  విద్యుత్తు షాక్‌కు గురై మృతిచెందాడు. గణేష్ గార్డెన్ సమీపంలో చేనును కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఇటీవల గాలి వానకు చేలో నుంచి వెళ్తున్న ఎల్‌టి లైన్ విద్యుత్తు వైర్లు తెగిపోయిన సమాచారాన్ని విద్యుత్తు సిబ్బందికి తెలిపారు. విద్యుత్తును నిలిపివేశామని సిబ్బంది తెలపడంతో సోమవారం ట్రాక్టర్‌తో చేను దున్నేందుకు శంకర్, తన కుమారుడైన వెంకటేష్‌తో పాటు బంధువైన నాగేంద్రబాబుతో కలిసి చేను దున్నదడం ప్రారంభించాడు. విద్యుత్తు వైర్లు అడ్డుగా ఉండడంతో వెంకటేష్ కర్ర సహాయంతో ఆ వైర్లను తొలగించే ప్రయత్నం చేశాడు. వైర్ల నుంచి విద్యుత్తు సరఫరా కావడంతో వెంకటేష్ షాక్‌కు గురయ్యాడు. దీన్ని గమనించిన తండ్రి శంకర్ కొడుకును కాపాడేందుకు అతడిని పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. దీంతో శంకర్ కూడా విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. ఈ పెనుగులాటలో వైర్లు వారిద్దర్నీ చుట్టుకున్నాయి. ట్రాక్టర్ దున్నుతున్న నాగేంద్రబాబు వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వెంకటేష్ మృతిచెందగా శంకర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శంకర్ మృతిచెందాడు. శంకర్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటంబానికి పెద్ద దిక్కయిన భర్త శంకర్‌తో పాటు చేతికందిన కొడుకు మృతిచెందడంతో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్‌ఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి ఏఈ వంశీని వివరణ కోరగా విద్యుత్తు వైర్లు తెగిన విషయం తమకు సమాచారం అందలేదని తెలిపారు.

Comments

comments