Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

దహీ పలావ్

కావాల్సిన పదార్థాలు బియ్యం: అర కిలో, పెరుగు: పావు లీటర్, పాలు: కప్పు, ఉల్లి పాయలు: రెండు, క్యారట్, ఆలూ, బీన్స్, బఠాణీలు: అన్నీకలిపి కప్పు ముక్కలు (టేస్టుకు తగినట్టు వేరే కూడా వాడొచ్చు), మిరియాలు: ఆరు లేదా ఘాటుకు సరిపడా, లవంగాలు: రెండు లేదా ఘాటుకు సరిపడా, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, జీడిపప్పు: పది, ఎండు ద్రాక్ష: ఐదారు, కుంకుమ పువ్వు: అర టీ స్పూన్, ఎరుపు, నారింజ, పసుపు రంగులు: అన్నీ కొద్ది కొద్దిగా, ఉప్పు: తగినంత, నెయ్యి: నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు.

తయారుచేసే విధానం… మందపాటి గిన్నెలో కూరగాయల ముక్కలు అన్నింటినీ వేసి, సగం ఉడికించి నీళ్ళు వంపేసి పక్కన ఉంచాలి. బియ్యం కడిగి సగం ఉడికించి నీళ్లు వంపేసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి. పాన్‌లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. అందులోనే మళ్ళీ ఉల్లి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. ఉడికించిన అన్నాన్ని మూడు భాగాలు చేసి ఒక్కో రంగును ఒక్కో భాగానికి కలిపి ఉంచాలి. గిన్నెలో మిగిలిన నెయ్యి వేసి మసాలా దినుసులన్నీ వేసి, వాటిపై సగం ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి ఉప్పు చల్లి ఒక నిమిషం ఉడికించి దించాలి. ప్రెషర్ పాన్ లేదా మందపాటి గిన్నెలో అడుగున నెయ్యి రాసి పసుపురంగు అన్నం వేసి దాని మీద కాస్త పెరుగు, కొన్ని ఉడికించిన కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నట్స్ వేయాలి. దానిపై ఎరుపు రంగు అన్నం వేసి అలాగే చేయాలి. చివరగా నారింజ రంగు అన్నం కూడా అంతే. ఇప్పుడు మొత్తం అన్నం అంతా కలిసేలా పాలు పోసి కుంకుమ పువ్వు చల్లి మూత పెట్టి పిండి ముద్దతో అంచుల్ని మూసేసి సిమ్‌లో 45 నిమిషాల పాటు దమ్ చేసి దించాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఉత్తరాది వంటకం అయినా పెరుగు చట్నీ లేదా రైతాతో ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది.

సింధీ కర్రీ
Curry1కావలసిన పదార్థాలు : బీన్స్ : ఎనిమిది లేదా అవసరానికి తగినన్ని, క్యారెట్లు : రెండు లేదా అవసరానికి తగినన్ని, బెండకాయలు: ఎనిమిది, మునక్కాయ: ఒకటి,జీలకర్ర, మెంతులు: టేబుల్ స్పూన్ చొప్పున, సెనగ పిండి : రెండు టేబుల్ స్పూన్లు, కోకం పువ్వు: నాలుగు (బజార్లో లభిస్తుంది), కారం: రెండు టేబుల్ స్పూన్లు లేదా రుచికి తగినంత, పసుపు: టేబుల్ స్పూన్, ధనియాల పొడి: టేబుల్ స్పూన్, ఇంగువ: చెంచా, పుదీనా: కట్ట, ఉప్పు: తగినంత, టొమాటోలు: అర కేజీ (మెత్తని గుజ్జులా చేసుకోవాలి), కంది పప్పు (మరీ మెత్తగా ఉడికించకుండా): రెండు లేదా మూడు చెంచాలు, నూనె: పావు కప్పు, ఆవాలు: చెంచా, కొత్తిమీర : కొద్దిగా.
తయారుచేసే విధానం…గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు, కోకం పూల పొడి, ఇంగువ, సెనగ పిండి కలిపి వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేగాక పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. రెండు లేదా మూడు నిముషాల తర్వాత టొమాటో గుజ్జు, ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కూరగాయ ముక్కలు, తగినంత ఉప్పు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టేయాలి. కొద్దిసేపటికి కూరగాయలు ఉడుకుతాయి. తర్వాత దించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. ఈ కర్రీ చపాతీలు, పుల్కాలే కాదు…అన్నం లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

Comments

comments