Search
Wednesday 21 November 2018
  • :
  • :

కస్టడీ ఖైదీ పరారీకి యత్నం…

KHIDI

మంచిర్యాల: జిల్లాలోని లక్షెట్టిపేట సబ్  జైలు నుంచి మంచిర్యాల కోర్టుకు హాజరుకావాల్సిన కస్టడీ ఖైదీ పారిపోవడానికి యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… సిసిసి పోలీసు స్టేషన్ పరిధిలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన సంపంగి శ్రీను గతేడాది డిసెంబర్ లో భార్యను అనుమానం తో హత్య చేశాడు. ఈ కేసులో నాలుగు నెలల నుంచి లక్షెట్టిపేట సబ్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే బుధవారం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చేందుకు మంచిర్యాలకు తీసుకొచ్చారు. అనంతరం నిందితుడు కోర్టు మెట్లు దిగే సందర్భంలో బేడీలతో పోలీసులను నెట్టి పరారీకి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శీనును వెంబడించి పట్టుకొని మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుటు హాజరుపర్చామని పోలీసులు వెల్లడించారు.

Comments

comments