Home తాజా వార్తలు శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం

Gold

రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులకు మంగళవారం 1.1 కిలోల బంగారం పట్టుబడింది. సౌదీ అరెబియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకుగాను తమ పాదాల కింద బంగారు బిస్కెట్లను ప్లాస్టర్‌తో అతికించి పై నుంచి సాక్స్ వేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.