Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త

ఏటేటా పెరుగుతున్న కేసుల సంఖ్య
మరికొన్ని సైబర్  ఠాణాలు

Cyber-crime1

మన తెలంగాణ/హైదరాబాద్ : నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు లాటరీలు, పెళ్లిళ్లు, బీమా కంపెనీలు, బహుమతులు, ఇలా రకరకాల పేర్లతో బాధితుల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. గతంలో పట్టణాలకే పరితమైన సైబర్ నేరాలు ఇప్పుడు రాష్ట్రం నలుమూలలకూ పాకాయి. పతీ రోజు జిల్లాలలో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2016లో 513 సైబర్ నేరాలు నమోదుకాగా 2017లో 1136కు పెరిగాయి. ఈ ఏడాది మే వరకు నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 610 కేసులు నమోదయ్యాయి. సైబర్ వేధింపులు, చోరీలు, మోసాలు పెరుగుతుండడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇలాంటి కేసులను చేధించేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా సైబర్ పోలీసు స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.

ఇదే తరహాలో జిల్లాలు, మిగతా పోలీసు కమిషనరేట్లు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, సిద్దిపేటలో సైతం సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. సైబర్ నేరాల దర్యాప్తుకు ఆయా జిల్లాలో ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా నియమించే పనిలో అధికారులు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇవ్వాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో సైబర్ నేరాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసారి జరిగే పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల్లో ఐటి పరిజ్ఞానం కలిగిన యువకులకు కొన్ని పోస్టులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ మోసగాళ్లు ఆటకట్టించే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశ్వవ్యాప్తంగా ఇటీవల కంప్యూటర్ రంగాన్ని గడగడలాడించిన ర్యాన్‌సమ్‌వేర్ ‘వానా క్రై’ ఉపద్రవాల నేపథ్యంలో సైబర్ నేరాలను అడ్డుకునే సెక్యూరిటీ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.

గ్రేటర్‌లో బీటెక్ ఎంటెక్ పూర్తిచేసినవారు ఇప్పటికే ఐటి, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నవారు సైతం సైబర్ సెక్యూరిటీ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగా ఇదే అంశంలో జెఎన్‌టియు పిజి కోర్సును సైతం ప్రారంభించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత ఏడాది కాలంగా సుమారు వెయ్యికిపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇందులో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్‌వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డేటా, సైబర్ స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌ను రూపొందించే అంశాలను సైబర్ సెక్యూరిటీ కోర్సులో భాగంగా ఉన్నాయి. ఈ రంగంలో మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Cyber Crime Increased in Hyderabad

క్లోనింగ్ ఇలా చేస్తారు…..

ఇంటర్‌నెట్‌తో పాటు కొన్ని ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు యాగ్నటిక్ స్ట్రిప్‌తో కూడిన ఖాళీ కార్డులను సైతం కొనుగోలు చేస్తుంటారు. వీటని ల్యాప్‌టాప్, కంప్యూటర్‌కు అనుసంధానించిన రైటర్‌లో పెట్టడం ద్వారా అందులోకి ఓ కార్డు డేటా ట్రాన్స్‌ఫర్ చేసి క్లోన్డ్ కార్డు రూపొందిస్తుంటారు. అంటే మన క్రెడిట్‌కార్డుకి నకలు దుండగుడి వద్ద తయారై పోతుందన్నమాట. తయారైన కార్డులను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న స్వైపింగ్ మిషన్ కలిగిన వారికి అందిస్తూ అక్కడ స్వైపింగ్ చేయిస్తారు. తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని స్వైపింగ్ మిషన్ హోల్డర్లు కమీషన్ తీసుకుంటూ సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తుంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే క్లోనింగ్ కార్డు ద్వారా మన ఖాతా ఖాళీ అయిపోతుంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి….

క్రెడిట్, డెబిట్ కార్డులను తీసుకోగానే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్ ప్యానల్‌లో సంతకం చే యాలి.
బ్యాంకు అధికారులు పంపిన పిన్ నెంబరును అలాగే వాడేయకుండా మార్చుకోవాలి.
ఇష్యూ చేసిన ప్రతి చెక్కుకూ సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.
ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ చేస్తున్న వినియోగదారులు మొదటిసారి వినియోగించిన తరవాత లాగిన్ ,ట్రా న్సాక్షన్ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి, వీటిని ఎక్కడా రాసిపెట్టకపోవడం ఉత్తమం.
బ్యాంక్ సిబ్బంది, ఎగ్జిక్యూటివ్‌ల పేరుతో వచ్చే ఫోన్ల ను నమ్మి వ్యక్తిగత వివరాలు చెప్పోద్దు.
మీ క్రెడిట్, డెబిట్ కార్డును దుకాణంలోనో, వెయిటర్‌కో ఇస్తే.. అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి.
నమ్మకమైన సైట్లతో తప్పాఆన్‌లైన్ లావాదేవీలు వద్దు.

అప్రమత్తమే శ్రీరామ రక్ష: క్రైమ్ డిసిపి జానకీ షర్మిల

ఆన్‌లైన్ వేధింపులను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆన్‌లైన్ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లలో భద్రతా సెట్టింగ్స్‌ను సమీక్షించాలి. తరచు పాస్‌వర్డ్‌లు మార్చడం మరింత మేలు చేకూరుస్తుంది. ఎవరైనా దూషణలకు పాల్పడితే వారి మాటలకు స్పందించకుండా నేరుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. వేధింపులకు సంబంధించిన అన్ని రకాల ఆన్‌లైన్ సాక్షాలను భద్రపరుచుకోవాలి.

Comments

comments