Home ఆఫ్ బీట్ వీడియోలు అదృష్టమంటే వీడిదే పో…!(వీడియో)

అదృష్టమంటే వీడిదే పో…!(వీడియో)

Cyclist escapes great Tragedy

నెదర్లాండ్స్: భూమ్మీద నూకలుండాలే కాని ఎలాంటి ప్రమాదం ఏమీ చేయలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం. వెంట్రుకవాసిలో చావునోట్లోంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి. ఈ షాకింగ్ సంఘటన నెదర్లాండ్స్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే… ఓ రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు పడ్డాయి. రైలు వెళ్లిన తర్వాత ఓ యువకుడు తన సైకిల్ తో పట్టాలను దాటుతున్నాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి అదే సమయంలో మరో రైలు వేగంగా దూసుకువచ్చింది. అది గమనించిన ఆ యువకుడు చేసేదేమీ లేక వేగంగా సైకిల్ ను ముందుకు పొనిచ్చాడు. దీంతో క్షణం తేడాతో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో కాస్త అంతర్జాలంలో ప్రత్యక్షమవ్వడంతో తెగ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు లక్కున్నోడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Cyclist escapes great Tragedy in Netherlands

Telangana Breaking News