Home సినిమా హాలీవుడ్ ఎంట్రీ

హాలీవుడ్ ఎంట్రీ

daggubati rana act in hollywood movie

‘బాహుబలి’ చిత్రంలో భళ్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు రానా. ఆతర్వాత అతనికి వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో రానా ‘హాతీ మేరే సాథీ’ చిత్రంలో చేస్తున్నారు. ఇదిలాఉండగా రానా కెరీర్‌లో మరో మైలురాయి జత కాబోతోంది. అదే హాలీవుడ్ ఎంట్రీ. ఇప్పటికే ఒక టీం అతనితో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించినట్టు తెలిసింది. అందులో రానా హీరోనా లేదా విలనా అనే వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో అనిల్‌కపూర్, ఇమ్రాన్ ఖాన్ వంటి బాలీవుడ్ నటులు ఇంగ్లీష్ సినిమాలు చేశారు. కానీ హాలీవుడ్ సినిమాల్లో తెలుగు వాళ్లు నటించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం చిరంజీవి హీరోగా ‘అబు ది బాగ్దాద్ తీఫ్’ అనే సినిమా షూటింగ్ ప్రారంభించుకొని ఆగిపోయింది. ఇప్పుడు రానా రూపంలో తెలుగు తేజం హాలీవుడ్ తెరపై మెరవబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.

daggubati rana act in hollywood movie