Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అచ్చం చంద్రబాబుగా రానా

Daggubati Rana In NTR Biopic Movie

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్‌టిఆర్’ బయోపిక్ మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ గెటప్‌లోని బాలయ్య లుక్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. బాలయ్య అచ్చం ఎన్టీఆర్‌లాగే ఉన్నారని కామెంట్స్ వినిపించాయి. అలాగే చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్న రానా లుక్ కూడా అచ్చం చంద్రబాబును పోలి ఉంటుందని తెలిసింది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. ఆ కారణంగానే గెటప్స్ అన్నీ చాలా సహజంగా వస్తున్నాయట. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Comments

comments