Search
Friday 21 September 2018
  • :
  • :

చంద్రబాబు నాయుడి పాత్రలో రానా.?

daggubati rana join ntr biopic

ఫిలింనగర్: ఎన్ టిఆర్ బయోపిక్ షూటింగులో ప్రస్తుతం దర్శకుడు క్రిష్ బిజీగా వున్నాడు. అయితే ఇదివరకే పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారు. తాజాగా మరోస్టార్ నటుడు ఈ బయోపిక్ చేరాడు. రానా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు. దివంగత మహా నటుడు ఎన్ టిఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిన్మాలో బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు చిత్రయూనిట్ శుక్రవారం వెల్లడించింది. బాలకృష్ణ, క్రిష్‌లతో కలిసి వున్న ఓ ఫొటోను రానా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అనితర సాధ్యుడైన ఓ మహోన్నత వ్యక్తి కథను కలిసి చెప్పబోతున్నాం. ఆయనే ఎన్ టిఆర్ అని రానా చెప్పారు. ఇందులో రానా ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించబోతున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, విద్యాబాలన్ తదితరులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు.

Comments

comments