Home పెద్దపల్లి అట్టుడికిన మంథని’..!

అట్టుడికిన మంథని’..!

Strike

పెద్దపల్లి : మంథని మండలం  ఖానా పూర్  గ్రామానికి చెందిన దళిత యవకుడు మధుకర్  పక్కనే ఉన్నవెంకటాపూర్ గ్రామానికి చెందిన   అమ్మా యిని  ప్రేమించిన పాపానికి  బందువులు  కిరాతకంగా  హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేదుంకు ప్రయత్ని స్తున్నారని   తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అద్యక్షులు చెరుకు సుధాకర్ , తెలంగాణ ప్రజా ఫ్రంట్ అద్యక్షులు గాదె ఇన్నయ్యలు  ఆరోపించారు  . శనివారం మృతుడి స్వగ్రామమైన  మంథని మండలం ఖా నాపూర్ గ్రామాన్ని సందర్శించి బాది తులను పరామర్శించారు.  పెద్దపల్లి  జిల్లా కేంద్రం లో పలు ప్రజాసంఘాల తో కలిసి ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మదుకర్ మరణాన్ని ప్రభుత్వ హత్య గా అభి వర్ణించారు .

గత నెల 13 న తమ కుమారున్ని  స్థానిక సర్పంచ్ కొడుకు చేవంతుల అఖిల్ తమ ఇంటి నుండి  తీసుకు పోయాడని  , మరుసటి దినం  తమ కుమారుడు   గ్రామ శివారు పొలాల్లో  శవమై కనిపించాడని , ఈ మర ణం వెనుక అమ్మాయి బందువుల  హస్తం ఉందని  మదుకర్ తల్లిదండ్రులు  స్థానిక సీఐకి ఫిర్యాదు చేశారని, ఇప్పటి వరకు అనుమానితులను అరెస్టు చేసి ప్రాథమిక విచారణ జరపక పోవడం వెనుక అధికార పక్షం ప్రజా ప్రతినిదుల ప్రమేయం ఉందని అన్నారు.దళిత యువకు డి మరణం పై ఇంత వివాదం జరుగుతున్నా స్థానిక ప్ర జా ప్రతినిదులు ఆ కుటుంబాన్ని పరామర్శించక పోవ డం అనేక అనుమాలకు తావిస్తోదంని ఆరోపించారు . కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు . మధుకర్  మృతదేహన్ని పోస్టు మార్టం చేసిన డాక్టర్లు , కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒత్తిళ్లకు తల ఒగ్గి తప్పుడు నివేదికలు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని , వెంటనే నిపునులచే  భహిరంగ   రీ పోస్టుమార్టం  జరిపించి   హంతకులను   శిక్షించాలని    ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డా. గోపినాథ్ , కోండ్ర స్వరూప , శ్రీ శైల్ రెడ్డి , శారద , సందీప్ కుమార్ , విక్రమ్ తదితరులు పాల్గొన్నారు .

రీ పోస్టుమార్టం చేయకుంటే ఇందిరాపార్కు ఎదుట ధర్నాకు దిగుతా..!

మధూకర్ తల్లిదండ్రును పరామర్శించిన కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు

 మంథని మధూకర్ మృ పై అతని తల్లిదండ్రులతో పాటు సామాజానికి అనేక అను మానాలు ఉన్నాయని, మూడు రోజుల్లోగా మధూకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని, లేకుంటే ఇంధిరా పార్కు ముందు ధర్నాకు దిగుతానని మాజీ పిసి సి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హను మంతరావు హెచ్చరించారు. ఆదివారం మంథని మధూ కర్ తల్లిదండ్రులను పరామర్శించి, అతని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేక రుల సమావేశంలో మాట్లాడారు.

కనీసం నలుగురు వై ద్యులతో కూడిన బృందంతో రీ పోస్టుమార్టం చేయించా లని ఆయన డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నివేదిక రాకముందే మంథని సిఐ మధూకర్‌ది ఆత్మహత్యా నేని అనడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయ న్నారు. కెసిఆర్ మాత్రం ఏమైనా సమస్య అంటే జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు కుసుంటానని అంటాడని, మనకు మాత్రం సమస్యలపై ధర్నా చేసే ందుకు తెలంగాణలో ధర్నా చౌక్ లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. ఇంధిర పార్కు వద్ద ధర్నా చౌక్ ఎత్తి వేసినప్పటికి మంథని మధూకర్ కేసులో న్యాయం జరుగకుంటే ధర్నాకు కుసుంటానని, ఏవ రు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మధూకర్ కుటుంబసభ్యులను పరామర్శించి, సమగ్ర న్యాయ విచారణకు అదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గోమాస శ్రీనివాస్, కోత్త శ్రీనివాస్, శశి భూషన్ కాచె, పుప్పాల తిరుపతి, కాశిపేట బాపు తదితరులు ఉన్నారు.