Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో దళితుడి హత్య

DALIT

అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఓ దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. భావనగర్ జిల్లా టింబి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్ (21) ఇటీవల గుర్రాన్ని కొన్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ గుర్రంపై ప్రతిరోజు గ్రామంలో తిరుగుతున్నాడు. ప్రదీప్ గుర్రంపై తిరగడాన్ని అగ్రవర్ణాలకు చెందిన యువకులు సహించలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రదీప్ వ్యవసాయ పొలం వద్దకు అగ్ర వర్ణాలకు చెందిన యువకులు వచ్చి అతడిని దారుణంగా చంపేశారు. అతడి గుర్రాన్ని కూడా చంపారు. గుర్రం కొన్న తన కొడుకు ప్రదీప్‌ను అగ్రవర్ణాలకు చెందిన యువకులు బెదిరించారని, తన కొడుకును చంపిన వారిపై చర్య తీసుకోవాలని ప్రదీప్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dalit Young Man Murder in Gujarat

Comments

comments