Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మళ్లీ రీ పోస్టుమార్టం

మధుకర్ మృతిపై కదలిక, మంథని సిఐ బదిలీ
ఆరుగురు అనుమానితుల అరెస్టు

Madhukar

మంథని: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మంథని మధుకర్ అనుమానాస్పద మృతి కేసులో మధుకర్ మృతదేహనికి ఉన్నత వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించను న్నట్లు తెలిసింది. మధుకర్‌ది ఆత్మహత్య కాదని, ము మ్మాటికి హత్యేనని, రీ పోస్టుమార్టం చేస్తే అసలు నిజాలు బయటపడుతాయని, మధుకర్ తల్లిదండ్రు లు, కుటుంబసభ్యులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం సమర్పించగా, మంథని మండల మేజిస్ట్రేట్ మధుకర్ శవానికి రీ పోస్టుమార్టం చేసేం దుకు వరంగల్ ఎంజిఎం వైద్య బృందానికి ఇటీవలే లేఖను రాయగా, వారు మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు శుక్రవారం మంథనికి రానున్నట్లు తెలిసింది.

మంథని సిఐ ప్రభాకర్‌పై బదిలీ వేటు..!

మధుకర్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో సిఐ ప్రభాకర్ పోస్టుమార్టం రిపోర్టు రాక ముందే ఆత్మహత్య అని వివాదాస్పద వాఖ్యలు చేయడం, దీని పై బాధిత కుటుంబసభ్యులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో పోలీసు శాఖ ఎట్టకేలకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా   మంథని సిఐ ప్రభాకర్‌ను రామగుండం కమిషనరేట్‌కు ఆటాచ్ చేస్తూ కొత్త సిఐగా నటేష్‌ను నియమించారు. కాగా, మంథని సిఐగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సిఐ నటేష్, మంథని ఎస్‌ఐ ఉపేందర్‌రావుతో కలిసి మధుకర్ మిస్టరీ మృతి కేసులో విచారణను మొదలు పెట్టారు. అందులో భాగంగా మధుకర్ శవం లభ్యమైన సంఘటన స్థ్ధలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానా పూర్‌కు వెళ్లిన సిఐ, ఎస్‌ఐలు మధుకర్ మృతి కేసులో అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన వారి ఇండ్లల్లో సోదా లు నిర్వహించారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారు మాట్లాడిన పాత కాల్ డిటెయిల్స్‌ను పరీక్షించే పనిలో పడ్డారు.

Comments

comments