Home పెద్దపల్లి పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకేనా ?

పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకేనా ?

మిస్టరీగా మారిన మంథని మధుకర్ మృతి
రీ పోస్టుమార్టం, సిబిసిఐడి విచారణకు
దళిత సంఘాల డిమాండ్
రిలే నిరాహార దీక్షలతో ఎంఆర్‌పిఎస్ ఆందోళన

Murder

మంథని/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మం థని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన దళిత యు వకుడు మంథని మధుకర్ (అలియాస్ మధు) అనుమా నాస్పద మృతి మిస్టరీగా మారింది. దళిత యువకుడైన మధుకర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో ప డ్డాడు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకో వాలనుకున్నట్లు సమాచారం. మార్చి 13న సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మధు మంగ ళవారం తెల్లవారే సరికి ఖానాపూర్ గ్రామ శివారులో ము ళ్లపొదల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పెద్దింటి యువతిని ప్రేమించినందుకే మధుకర్‌ను హత మార్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతి కిరాతకంగా హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఒంటిపై పురుగుల మం దు చల్లి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు మధుకర్ కుటుంబసభ్యులు, దళిత సంఘాల నేత లు ఆరోపిస్తున్నారు.

మంథని సిఐని సస్పెండ్ చేయాలి

మంథని సిఐ మధుకర్ హత్యను నీరుగార్చేలా చూస్తున్నా రని, వెంటనే సిఐని సస్పెండ్ చేయాలని ఎంఆర్‌పిఎస్ జా తీయ అధికార ప్రతినిధి మంద కుమార్ డిమాండ్ చేశా రు. మధుకర్‌ను హత్య చేసిన నిందితులను అరెస్టు చే యాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంఆర్‌పిఎస్ ఆధ్వ ర్యంలో మంథని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం లో ఎంఆర్‌పిఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు రేణికుంట సాగర్, సింగరేణి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ తదితరులు కూర్చున్నారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి

తమ కొడుకు మధుకర్‌ను అత్యంత కిరాతకంగా హత్య చే సిన నిందితులను వెంటనే శిక్షించాలని మధూకర్ తల్లి దండ్రులు మంథని లక్ష్మి, ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి రాగా, కలెక్టర్ కార్యాలయంలో అందుబా టులో లేకపోవడంతో ఎఒకు ఫిర్యాదు కాపీని అందజేసి నట్లు తెలిపారు.

న్యాయ విచారణకు టిజెఎసి డిమాండ్
మంథనికి నిజ నిర్ధారణ కమిటీ: సిపిఐ(ఎం)
హైదరాబాద్: మధుకర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలంటే మధుకర్ మృతదేహానికి తిరిగి పోస్టుమార్గం నిర్వహించాలని, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు, దళిత సంఘాలు సేకరించిన సమాచారం ప్రకారం మధుకర్‌ను హింసించి హత్య చేసినట్లు స్పష్టమవుతుందన్నారు.

కళ్లు పీకి, పక్కటెముకలు విరగ్గొట్టి, మర్మాంగాలు కోసి హత్య చేశారని తెలుస్తుందన్నారు. పలుకుబడి గల నాయకుల జోక్యంతో ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు పెత్తందార్లు మధుకర్‌ను దారుణంగా చంపేశారని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం అన్నారు. ఈ ఘటనలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఆదివారం సంఘటనా స్థలానికి పంపుతున్నట్లు ఆయన ఎంబి భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. కమిటీ నివేదిక అనంతరం ప్రత్యక్ష ఉద్యమాన్ని చేపడ తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసా గిస్తామని ఆయన ప్రకటించారు.