Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చురుగ్గా చనాఖా-కొరటా పనులు

8వేల క్యూబిక్ మీటర్లు  పూర్తయిన సిమెంట్  పనులు
వచ్చే ఏడాది సాగు  నీరందించేందుకు  ప్రణాళిక

Jogu-ramanna

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ నదిపై చనాఖా-కొరటాల మధ్య ఆనకట్ట నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వర్షకాలంలో వరద నీటి కారణంగా నాలుగు నెలల పాటు నిలిచిన పులు మళ్లీ మొదలయ్యాయి. కొత్తగా మరో నాగులు గేట్లు పెంచడంతో ఆపనులు చకచక గా జరుగుతున్నాయి. వాటితో పాటు వరదల కారణంగా పేరుకుపోయిన పూడిక మట్టి తొలగింపు పనులు కూడా జరుగుతున్నాయి.

పనుల పురుగతిపై మంత్రులు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వచ్చే సంవత్స రం ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తిచేసి సాగు నీరంది ంచా లనే లక్షంతో ప్రణాళికలు తయారు చేశారు.లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్ 1975 నుంచి కొన సాగుతున్న విషయం తెలసిందే. ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో చనాఖా-కొరాటా వద్ద 0.83 టీఎంసీల నీటి నిల్వ సామర్ధంతో ఆనకట్ట నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మహారాష్ట్ర సర్కార్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది.

80 శాతం తెలంగాణ 20 శాతం మహారాష్ట్ర వినియోగిం చుకోనున్నాయి. ఆనకట్ట నిర్మాణానికి రూ.234.521 కోట్లు కేటాయించింది. నీటి ఎత్తిపోతల ద్వారా పిప్పల్‌కోటి గుట్ట మీదకు 116 మీటర్ల ఎత్తునకు తీసుకెళతారు. ఇక్కడ మూడు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఒక్కో మోటరుకు 12 మెగావాట్స్ సామర్దంతో మూడు మోటర్లు 36 మెగావాట్ల పంపులు పనిచేస్తాయి. ప్రధాన కాలువకు 8 డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాంసి, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని 13,500 ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు. ఆనకట్ట నిర్మాణ పనులు వేగంగా సాగు తున్నాయి. వచ్చే ఎడాది ఖరీఫ్ సీజన్‌లో దీన్ని పూర్తి చేసి రైతులకు సాగు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటివల రాష్ట్ర మంత్రి జోగు రామన్న సందర్శించిన సమ యంలో కాంట్రాక్టర్లకు సూచించారు.

Comments

comments